జూన్‌ నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా !

Telugu Lo Computer
0


ద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌ నుంచి నిధుల ఉపసంహరణను సులభతరం చేయనుంది. త్వరలో యూపీఐ నగదు విత్‌ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. ఈ ఏడాది మే లేదా జూన్‌ నుంచి ఉద్యోగులు పీఎఫ్‌ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు. ప్రావిడెండ్‌ ఫండ్స్‌ నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలిపారు. కేవలం నగదు విత్‌డ్రా మాత్రమే కాకుండా.. పీఎఫ్‌లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు. ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ విధానంలో 1 లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్‌కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిజిటలైజ్‌ చేయడంలో ఈపీఎఫ్‌ఓ గణనీయమైన పురోగతి సాధించిందని దావ్రా పేర్కొన్నారు. విత్‌డ్రా సదుపాయాన్ని క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్‌లను ఏకీకృతం చేసిందని తెలిపారు. అంతేకాకుండా క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం 3 రోజులకు తగ్గిందని చెప్పారు. 95 శాతం క్లెయిమ్‌లు ఆటోమేటెడ్‌ ప్రాసెస్‌ రూపంలో జరుగుతున్నాయని తెలిపారు. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్‌ విత్‌ డ్రా ఆప్షన్‌ అనేది ఒక మైలురాయి అని, లక్షలాది మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలగనుందని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)