ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని గతేడాది అక్టోబర్ 31 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ తీసుకోని వారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. బుక్ చేసుకోని పక్షంలో లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని గుర్తు చేశారు. ఈ పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. దీనికి రేషన్ కార్డు ప్రామాణికం. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో వారి పేరు కచ్చితంగా రేషన్ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.
నెలఖారులోగా మొదటిది ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి !
March 14, 2025
0
Tags