పంజాబ్‌లో ముగ్గురు బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్‌

Telugu Lo Computer
0

పంజాబ్‌లో హత్యలకు ఖలిస్థానీ సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్‌, పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను జగ్‌రూప్‌ సింగ్‌ అలియాస్‌ జగ్గా, సుఖ్‌జిత్‌ సింగ్‌ అలియాస్‌ సుక్కా, నవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ నవ్‌లుగా గుర్తించారు. వీరి నుంచి అత్యాధునిక గ్లాక్‌ 9ఎంఎం పిస్టోల్‌, ఒక మ్యాగ్జైన్‌, పీఎక్స్‌5 స్ట్రామ్‌ పిస్టోల్‌, ఒక మ్యాగ్జైన్‌, ఒక దేశీయ తయారీ 30 బోర్‌ గన్‌, మరో దేశీయ తయారీ 32 బోర్‌ తుపాకీ, తూటాలను స్వాధీనపర్చుకొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గురుప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ గోపీ నౌషహరియా వీరి హ్యాండిలర్‌గా గుర్తించారు. అతడు పాక్ కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ ఉగ్రవాదులు హర్వీందర్‌ సింగ్‌ రిండా, గ్రీస్‌ కేంద్రంగా పనిచేసే లాడి బకాపురియాకు అత్యంత సన్నిహితుడు. తాజాగా నిందితులపై అమృత్‌సర్‌లో కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)