ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. మండలిలో గురువారం వైకాపా ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు సూపర్‌సిక్స్ పథకాల అమలును ప్రస్తావించగా.. దానిపై మంత్రి మాట్లాడారు. 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుంది. అయితే ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లేందుకు అవకాశం ఉండదు' ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణం అనే మేం చెప్పాం. ఈ విషయమై స్పష్టత ఇస్తున్నాం' అని పేర్కొన్నారు. బడ్జెట్‌పై ఎమ్మెల్సీలు కళ్యాణి, చంద్రశేఖర్‌రెడ్డి, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, వంకా రవీంద్ర తమ అభిప్రాయాలను వెల్లడించారు. మండలి ప్రారంభమైన వెంటనే సామాజిక పింఛన్ల మంజూరుపై చర్చించేందుకు వైకాపా ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ మోషేనురాజు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు, బడ్జెట్‌పై సభ్యులు మాట్లాడిన అనంతరం సభను శుక్రవారానికి వాయిదావేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
March 07, 2025
0
Tags