ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా తరఫున అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళలో ఒకరైన స్మిత్ 2010లో వెస్టిండీస్‌తో వన్డేలో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 170 వన్డేలు ఆడిన స్మిత్ 43.28 సగటుతో 5 వేల 800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 34.67 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. 2016లో న్యూజిలాండ్‌పై 164 పరుగులతో తన అత్యధిక స్కోరు.
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్ !
March 05, 2025
0
Tags