భారతీ రాజా కుమారుడు మనోజ్ భారతీ రాజా మృతి !

Telugu Lo Computer
0


ర్శకుడు భారతీ రాజా కుమారుడు మనోజ్ భారతీ రాజా (48) గుండెపోటుతో కన్నుమూశాడు. మంగళవారం (మార్చి 25) తీవ్ర అస్వస్థతకు గురైన అతనని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో  మనోజ్ తుది శ్వాస విడిచాడు. దీంతో తమిళ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే మనోజ్ కన్నుమూయడంతో భారతీ రాజా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు, నెటిజన్లు మనోజ్ భారతీ రాజా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మనోజ్ 1998లో తాజ్ మహల్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. అంతకు ముందు ఎంథిరన్ (తెలుగులో రోబో) చిత్రంలో దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. సముద్రామ్, కాదల్ పూక్కల్, అల్లి అర్జున, వరుషమేళ్ళం వసంతం వంటి చిత్రాల్లోనూ కథానాయకుడిగా మెప్పించాడు మనోజ్. అలాగే శింబు చిత్రం మానాడులోనూ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక నటుడిగా చివరిగా కార్తి విరుమాన్ లో కనిపించాడు మనోజ్. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన స్నేక్స్ అండ్ లాడర్స్ వెబ్ సిరీస్‌లో నూ మనోజ్ కీలక పాత్ర పోషించాడు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ భారతీ రాజా కుమారుడు సత్తా చాటాడు. అతను తెరకెక్కించిన కిళ్లిపట్టు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)