భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును  భాజపా ఖరారు చేసింది.  ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో తెదేపాకు 3, జనసేన, భాజపాలకు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది. తెదేపా అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరికి, ఎస్సీ సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు చెరో స్థానాన్ని కేటాయించింది. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా భాజపా అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. తెదేపా అభ్యర్థులు, సోము వీర్రాజు ఇవాళ నామినేషన్‌ వేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయే కూటమి అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశముంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)