కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం పై ఏఐసీసీ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు. తన నివాసంలో బీసీ నేతలతో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని తేల్చి చెప్పారు. అలాగే బీసీ కులగణన కు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సహకరిస్తామని తెలిపారని, త్వరలోనే సీఎం అపాయింట్మెంట్ కోరుతున్నామని ఆయన తెలిపారు. సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే ఆయనతో మాట్లాడి మున్నూరుకాపు సభ ఎప్పుడు ఎక్కడ పెడతామో చెబుతానని వీహెచ్ అన్నారు. పార్టీలో ఒకరిద్దరు నేతలు నాపై కోపంగా ఉండొచ్చు. కానీ తాను పార్టీకి చెడు చేయనని ఈ సందర్భంగా వీ హనుమంతరావు తేల్చి చెప్పారు.
మున్నూరు కాపు నేతల సమావేశం పై ఏఐసీసీ సీరియస్ పై స్పందించిన వీహెచ్ !
March 02, 2025
0
Tags