బినిటా ఛెత్రీకి డ్యాన్సులో పట్టు కఠిన సాధనతో మాత్రమే వస్తుంది : ఆనంద్ మహీంద్ర

Telugu Lo Computer
0


సోంకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక, బినిటా ఛెత్రీ తాజాగా బ్రిటన్‌లో తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపర్చింది. బ్రిటన్‌లో నిర్వహించిన షోలో పాల్గొన్న ఆ బాలిక వేసిన స్టెప్పులు అందరితోనూ అదుర్స్ అనిపించాయి. ఆ షోలోని జడ్జిలు ఆమె వేసిన ప్రతి స్టెప్పుకు వావ్ అనకుండా ఉండలేకపోయారు. దీనిపై ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ ఆ బాలిక వయసు కేవలం 8 సంవత్సరాలని, ప్రపంచ స్థాయి ప్రదర్శన ఇచ్చిందని చెప్పారు. ఆమెలో ఉక్కు సంకల్పం ఉందని అన్నారు. డ్యాన్సులో ఆమెకు ఆ పట్టు కఠిన సాధనతో మాత్రమే వస్తుందని తెలిపారు. ఆమె తన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టిన తీరు అద్భుతమని ప్రశంసల జల్లు కురిపించారు. తన టాలెంట్ ప్రదర్శించే ముందు బినిటా ఛెత్రీ ఆ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో మాట్లాడిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. "నా పేరు బినిటా ఛత్రీ.. నాకు ఎనిమిది సంవత్సరాలు. నేను ఇండియాలోని అసోం నుంచి వచ్చాను. బ్రిటన్ గాట్ టాలెంట్ లో  పాల్గొనడం నా కల. నేను పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలనుకుంటున్నాను" అని చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)