తెలంగాణలో వడగండ్ల వాన !

Telugu Lo Computer
0


తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. నిజామాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల వానకు నిజామాబాద్‌లోని ధర్పల్లి మండలంలో వరి ధాన్యం తడవగా, కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి, రాజారం, తిమ్మాపూర్‌తోపాటు పలు గ్రామాల్లో పలుచోట్ల మామిడి తోటలో పూత, కాయలు రాలిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్‌లో భారీగా వడగండ్ల వాన కురిసింది. అయితే మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో విలవిలలాడని జనం ఒక్కసారిగా వర్షం కురవడంతో సంబరపడుతున్నారు. అయితే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే సమయంలో వర్షాలు కురుస్తున్నాయని బాధపడుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)