ఆంధ్రప్రదేశ్ లో నకిలీ ఎస్ ఐ అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సంగంలో ఈ నకిలీ ఎస్ ఐగా చెలామణి అవుతూ తిరుగుతున్న హరీష్ అనే వ్యక్తిని సంగం పోలీస్‌లు అరెస్ట్ చేశారు. సంగం పోలీస్ స్టేషన్ లో  నకిలీ ఎస్ ఐ అరెస్ట్ గురించి ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సంగం కొత్త చెక్ పోస్ట్ వద్ద నకిలీ ఎస్ ఐగా వేషధారణ ధరించి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తున్నట్లు సమాచారం అందడంతో అరెస్ట్ చేశామని తెలిపారు. ముద్దాయి నుండి కారు, నకిలీ యూనిఫాం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సిద్ధీపురంకి చెందిన హరీష్ అనే వ్యక్తి 2023లో వచ్చిన ఎస్ ఐ ఫలితాల్లో సెలెక్ట్ అయ్యానని నమ్మించి, నకిలీ ఎస్ ఐ వేషధారణ వేసి మోసం చేస్తూ తిరుగుతున్నాడని తెలిపారు. పలు ప్రాంతాలలో వాహనాలు నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, ఇతర సిబ్బందిని అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)