తెలంగాణలోని నల్లగొండ జిల్లా ఆర్జాలబావి, తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని, వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అలా జరగకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ కు సవాల్ విసిరారు. రోజు రోజుకి ప్రజల నుండి దూరమవుతున్నామన్న ఆక్రోషంతో బీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ఆరు హామీల అమలులో భాగంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని చెప్పారు.
అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
March 25, 2025
0
Tags