టాలీవుడ్ ఫైట్ మాస్టర్ షిహాన్ హుస్సేని కన్నుమూశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వంటి పోరాట విద్యలను నేర్పించిన గురువు షిహాన్ హుస్సేనియే. పవన్ కళ్యాణ్ తన మొదటి రోజుల్లోనే హుస్సేని దగ్గర శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా 'తమ్ముడు', 'బద్రి', 'జానీ' వంటి చిత్రాల్లో పవన్ చూపించిన ఫైట్ మూమెంట్స్ వెనుక హుస్సేని శిక్షణ ఉందని సినీ వర్గాలు చెబుతాయి. హుస్సేని అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్‌లో రాణించారు. ఆయన పవన్ బ్లాక్ బెల్ట్ సాధించి, మార్షల్ ఆర్ట్స్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ముఖ్యంగా కరాటే, తాయ్‌క్వాండో, కిక్ బాక్సింగ్ వంటి పోరాట కళల్లో ప్రావీణ్యం సాధించి, ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు. షిహాన్ హుస్సేని మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, శిష్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. "హుస్సేని సార్ లాంటి గురువులను కోల్పోవడం బాధాకరం. ఆయన మార్గదర్శకత్వంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నా కెరీర్‌లో ఎంతో ఉపయోగపడ్డాయి." – అని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ఫైట్ మాస్టర్ షిహాన్ హుస్సేని కన్నుమూత !
March 25, 2025
0
Tags