ఏలియన్స్‌పై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న బయోలజీ ప్రొఫెసర్ కౌల్సన్ విస్తృత పరిశోధనలు చేశారు. దీనిపై ప్రపం వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలకు సలహాలు కూడా ఇచ్చారు. దాదాపు 200 ఆర్టికల్స్ రాశారు. ప్రపంచంలో అత్యంత ప్రముఖ బయోలజిస్ట్‌లో ఆయన ఒకరు. తాజాగా ఏలియన్స్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలను 'ది యురోపియన్ మ్యాగజైన్'లో పబ్లిష్ చేశారు. ఆయన థియరీ ప్రకారం, గ్రహాంతర వాసులు ఇప్పటికే భూమి దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. వారు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా ఉండబోరు. 'చాలా లావుగా, నెమ్మదిగా కదిలే బొమ్మల్లా' ఉంటారు. అవతార్ సినిమాల్లో చూపించినంత ఆకర్షణీయంగా ఉండబోరు. 'స్టార్ వార్స్'లో ఉండే 'జబ్బా ది హట్' క్యారెక్టర్ తరహాలో ఉండే అవకాశం ఉంది. లేదా డూన్ సినిమాలోని బారన్ వ్లాదిమిర్ హర్కొనెన్‌లా ఉండొచ్చు. కౌల్సన్ అంచనాల ప్రకారం యూనివర్స్‌లో ఎక్కడో ఒక చోట జీవం ఉందనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. వారి శరీరం కూడా మన తరహాలోనే నిర్మితమై ఉండొచ్చు. ప్రవర్తన కూడా మనలాగే ఉండే అవకాశం ఉంది. మన భూమిపై లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఇప్పటికే వారు అత్యంత అధునాతన స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమికి బయలుదేరి ఉంటారు. ఇక్కడ శాశ్వతంగా సెటిల్ కావాలనే ఉద్దేశంతోనే వస్తూ ఉంటారు. అదే జరిగితే భూమిని వారు కచ్చితంగా ఆక్రమించేందుకు యత్నిస్తారు. అయితే ఏలియన్స్ భూమిని ఆక్రమించే అవకాశాలు చాలా తక్కువేనని కౌల్సన్ తెలిపారు. అంతరిక్షంలో సుదీర్ఘ ప్రయాణాలు చేయడం సాధ్యం కాకపోవడమే అందుకు కారణం. మానవుల కంటే తెలివైన వారు అయినప్పటికీ, ఒక గ్యాలక్సీ నుంచి మరో గ్యాలక్సీకి ప్రయాణించడం అంత సులువు కాదు. అందుకే భూమిని ఆక్రమించుకోవాలనే ఏలియన్స్ లక్ష్యం నెరవేరకపోవచ్చు. పైగా ఇతర జీవుల పట్ల మానవుల ప్రవర్తనా తీరును చూసి వారు ఇక్కడ ఉండటానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. అయినప్పటికీ మానవాళి ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కౌల్సన్ సూచించారు. ఏలియన్స్ భూమిని స్వాధీనం చేసుకుని, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అందుకు సహకరించకపోయినప్పటికీ, భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చని హెచ్చరించారు. భూమిని ఆక్రమించడమే లక్ష్యంగా వచ్చే ఏలియన్స్‌ని ఎదుర్కొనేందుకు మానవాళి సంసిద్ధంగా ఉండాలని సూచించారు. వారు కచ్చితంగా మన కంటే తెలివైన వారు అయి ఉంటారని అంచనా వేశారు. అంతులేని యూనివర్స్ నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ముప్పు ఉంటుందో చెప్పడం కష్టమని వివరించారు.
భూమిపైకి వస్తున్న ఏలియన్స్ ?
March 06, 2025
0
Tags