శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం కావటంతో కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు నుదుటున నామం, సంప్రదాయ వస్త్ర ధారణతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్ళారు. దేవాన్ష్​ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు విరాళం అందించారు. అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ పాలక మండలి సభ్యులు చంద్రబాబుకు ప్రసాదాలు అందచేసారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్​ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అన్నదాన కేంద్రంలో ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్​ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చెక్కు ఇచ్చారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు సీఎం హోదాలో రెండోసారి తిరుమల పర్యటనకు వచ్చారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అధికారులతో కలిసి తిరుమలలో సేవల పైన సమీక్ష చేయనున్నారు. భక్తులకు అందతున్న సేవలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యత, అన్నప్రసాద కేంద్రాల్లో ప్రసాదాల వితరణ, క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీయనున్నట్లు సమాచారం. దేవాన్ష్ తో సహా కుటుంబ సభ్యులు అన్నదానం కేంద్రంలో భక్తులు వడ్డన చేసారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు అక్కడే ప్రసాదం స్వీకరించారు. శ్రీవారి దర్శనం తరువాత ఆలయ ప్రాంగణంలో చంద్రబాబు, కుటుంబ సభ్యులు ఆలయ పాలక మండలి సభ్యులు... అర్చకులు చంద్రబాబు కుటుంబానికి శ్రీవారి ప్రసాదాలు అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)