కేరళలోని కన్నూర్‌లో మహిళా జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. రెండుసార్లు అక్కడ తిరిగి మాయమైంది. ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో జైలు భద్రతపై ఆందోళన రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.జిల్లా జైలు, ప్రత్యేక సబ్ జైలు వెనుక మహిళా జైలు ఉన్నది. ఈ జైలు చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి. మార్చి 1న రాత్రి 11.15 గంటల సమయంలో మహిళా ఖైదీలున్న జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. 25 మీటర్ల ఎత్తులో రెండుసార్లు అక్కడ తిరిగింది. డ్రోన్ ఎగరడాన్ని జైలు సిబ్బంది గమనించారు. జైలు సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కన్నూర్‌లో మహిళా జైలుపై డ్రోన్ కలకలం !
March 05, 2025
0
Tags