ఐపీఎల్​ బెట్టింగ్​కు యువకుడు బలి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలో గుండ్లపోచంపల్లిలో క్రికెట్ బెట్టింగ్​కు సోమేశ్ అనే యువకుడు బలయ్యాడు. సోమేశ్ (29) దేవరయాంజాల్ పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్​కు అలవాటుపడిన సోమేశ్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. అయితే, వాటిలో కొన్ని కంపెనీకి చెందిన డబ్బులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారో అని సోమేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. డ్యూటీకి టైం అవుతున్నప్పటికీ సోమేశ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఫోన్ చేస్తే కాసేపు ఆగి వస్తానని చెప్పాడు. కానీ స్నేహితులకు మాత్రం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఫ్రెండ్స్ అందరికీ తన లోకేషన్ కూడా షేర్ చేశాడు. తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ స్నేహితుడు వద్దని వారించినప్పటికీ సోమేశ్ వినిపించుకోలేదు. లోకేషన్ ఆధారంగా స్పాట్​కు వెళ్లి చూడగా సోమేశ్ చనిపోయి ఉన్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నాలుగేండ్ల కింద అక్క పెండ్లి కోసం అప్పుగా తీసుకొచ్చిన రూ.3 లక్షలను బెట్టింగ్​లో పోగొట్టుకున్నాడని అతని స్నేహితులు చెప్తున్నారు. ఆ టైమ్​లో ఇంట్లో గొడవలు జరిగాయి. గట్టిగా బెదిరిస్తే కొడుకు ఏమైనా చేసుకుంటాడేమో అని తల్లిదండ్రులే అప్పులు తీర్చారు. అప్పటి నుంచి బెట్టింగ్ జోలికి వెళ్లలేదు. తాజాగా ఐపీఎల్​లో బెట్టింగ్ పెట్టి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)