ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు సరస్సు ఆక్రమణలపై అటవీశాఖ సర్వే ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు సర్వే చేపట్టారు. గుడివాకలంక నుంచి సర్వేను ప్రారంభించారు. డ్రోన్ల సహాయంతో ఆక్రమణల వివరాలను సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సర్వే వివరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. కొల్లేరు సరస్సులో సహజ నీటిప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతేడాది డిసెంబరు 11న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేయాలని ఆదేశించింది.
కొల్లేరు ఆక్రమణలపై అటవీశాఖ సర్వే ప్రారంభం
March 09, 2025
0
Tags