శాంసంగ్ గెలాక్సీ A26 5G ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్‌ను Galaxy A06 5G, గెలాక్సీ A26 5G, గెలాక్సీ A36 5G, గెలాక్సీ A56 5G వంటి కొత్త మోడళ్లతో విస్తరించింది. ఈ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 15-ఆధారిత One UI 7 కస్టమ్ స్కిన్, 50MP ప్రైమరీ కెమెరా “Awesome Intelligence” అనే ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఈ గెలాక్సీ మోడళ్లలో చాలా వరకు ఫోన్లు భారత మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ A26 టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నివేదికల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A26 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రెండు (8GB + 128GB, 8GB + 256GB) స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ కావచ్చు. ఈ రెండు వెర్షన్ల ధర వరుసగా రూ. 24,999, రూ. 27,999 ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2340 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన 6.7 స్క్రీన్‌ను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A26 5G ఫోన్ బరువు 200 గ్రాములు, 164 x 77.5 x 7.7mm కొలతలు కలిగి ఉంది. కంపెనీ సొంత 5nm ఫాబ్రికేషన్ల ఆధారంగా 2GHz క్వాడ్ A55 + 2.4GHz క్వాడ్ A78 కోర్లను కలిగింది. ఇందులో Exynos 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ 5G శాంసంగ్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ గ్రాఫిక్స్ కార్డు మాలి-G68 MP5 GPUని కలిగి ఉంది. ఈ ఫోన్ 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB అనే 3 వేర్వేరు స్టోరేజీలలో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ One UI7 (6 మెయిన్ ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ సపోర్టు ) Android 15 ఆధారంగా రూపొందించింది. సెల్ఫీల కోసం 13MP (వైడ్) ఫ్రంట్ కెమెరా, బ్యాక్ సైడ్ 50MP (వైడ్) + 8MP (అల్ట్రా-వైడ్) + 2MP (మాక్రో) ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉన్నాయి. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కలర్ ఆప్షన్లలో బ్లాక్, వైట్, మిట్, పీచ్ పింక్ ఉన్నాయి.
త్వరలో శాంసంగ్ గెలాక్సీ A26 5G లాంచ్ ?
March 23, 2025
0
Tags