నారాయణ మూర్తి : 0.40% వాటాతో ఆయన సంపద రూ.3,299 కోట్లకు తగ్గింది, ఇది రూ. 684 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
సుధా నారాయణ మూర్తి: 0.92% వాటాతో ఆమె సంపద రూ.7,600 కోట్లకు తగ్గింది, ఇది రూ.1,573 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
రోహన్ మూర్తి: 1.62% వాటాతో సంపద రూ.13,378 కోట్లకు తగ్గింది, ఇది రూ.2,771 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
అక్షత మూర్తి: 1.04% వాటాతో సంపద రూ.8,591 కోట్లకు తగ్గింది, ఇది రూ.1,779 కోట్ల తగ్గుదలను సూచిస్తుంది.
ఎకాగ్రహ్ రోహన్ మూర్తి: 0.04% వాటాతో సంపద కూడా తగ్గుదలకు లోనైంది ఈ తగ్గుదల ఇన్ఫోసిస్ షేర్ల ధర పడిపోటం వల్ల జరిగింది. దీని వల్ల కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ సుమారు రూ.46,108 కోట్లు కరిగిపోయింది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.7.54 లక్షల కోట్లకు తగ్గింది. ఇన్ఫోసిస్ తాజా త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. విస్తృతమైన ఆర్థిక పరిస్థుతులు, గ్లోబల్ మార్కెట్ ఒత్తిడులు ఇన్వెస్టర్ల మనోభావాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్ నిపుణులు ఈ పరిస్థితులను గమనిస్తూ ఇన్ఫోసిస్ సహా ఇతర ఐటీ కంపెనీల ప్రదర్శనపై దృష్టి సారిస్తున్నారు.