రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడాలని తాము కోరుకుంటున్నామన్నారు. నీటిపారుదల కోసం సోలార్ పైపుల ద్వారా రైతులకు విద్యుత్ సంబంధిత ఇబ్బందుల్ని తమ ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. రాబోయే మూడేళ్లలో 30లక్షల సోలార్ ఇరిగేషన్ పంపుల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన మౌలికవసతులు, విద్యుత్తు, రోడ్లు లేవన్న ఆయన.. భాజపా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకొచ్చారు.
మధ్యప్రదేశ్‌లో రూ.5కే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ !
March 02, 2025
0
Tags