గ్రోక్ 3 లో ఎడిట్ ఇమేజ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఎలాన్‌మస్క్ స్వయంగా 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. గ్రోక్ 3 అకౌంట్‌ని లాగిన్ అయ్యాక సెర్చ్ బార్ కింద డీప్‌సెర్చ్, థింక్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. దాని పక్కనే కొత్తగా ఎడిట్ ఆప్షన్‌ను జత చేశారు. ఈ Edit Image ఆప్షన్‌ను ఎంచుకొని మీకు ఎలాంటి మార్పులు కావాలో దానికి సంబంధించిన టెక్ట్స్ అందిస్తే చాలు. వెంటనే చిత్రాన్ని మార్చి పంపుతుంది. దీంతో మీకు నచ్చినట్టుగా ఫొటోలను మీరే ఎడిట్ చేసుకోవచ్చన్నమాట. ప్రస్తుతం డెస్క్‌టాప్‌లో గ్రోక్3 వినియోగిస్తున్న వారికి దాదాపుగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అందరికీ రోలవుట్ కానుంది.
గ్రోక్ 3లో ఎడిట్ ఇమేజ్ ఫీచర్ !
March 23, 2025
0
Tags