25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదే : రఘునందన్‌రావు

Telugu Lo Computer
0

హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఏర్పాటు చేసిన మీట్ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుతో పాటు మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశానికి అపార చాణుక్యుడిగా అమిత్ షా ఉన్నారని తెలిపారు. నరేంద్ర మోడ మూడుసార్లు ప్రధాని కావడానికి అన్నితానై వ్యవహరించారన్నారు. దక్షిణ భారతదేశం నుంచి మొదలుకొని ఉత్తర్‌ప్రదేశ్‌ వరకు రకరకాల పేర్లతో పిలవబడే ఆర్యవైశ్యులు.. సామాజిక సేవలో ముందుంటారని పేర్కొన్నారు. ఆర్థికంగా బలంగా ఉండే ఆర్యవైశ్యులు రాజకీయాల్లో మరింత రాణించాలని, దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేది రాజకీయనాయకులేననే విషయాన్ని గ్రహించాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)