నేటి నుంచి 24 గంటల పాటు దుకాణాలు ఓపెన్ !

Telugu Lo Computer
0


రంజాన్ మాసం సందర్భంగా నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు తెలంగాణలో దుకాణాలు తెరిచి ఉండనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. వ్యాపార సముదాయాలలో పనిచేసే సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పని చేస్తే యాజమాన్యం రెట్టింపు జీతం ఇవ్వాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కాగా నిన్న నెలవంక కనిపించడంతో రంజాన్ ప్రారంభమైనట్లు ముస్లింలు ప్రకటన చేశారు. దీంతో 31 రోజుల పాటు ఉపవాసాలు కొనసాగనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)