2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుంది : అమిత్‌ షా 'ఎక్స్‌'లో ట్వీట్

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లో జరిగిన కాల్పుల్లో  22 మావోయిస్టులు  మృతి చెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్‌ షా స్పందించారు. భారత్‌ను నక్సల్‌ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఇది మరో పెద్ద విజయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. ''అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదు. అలాంటి వారి పట్ల మోదీ సర్కార్‌ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈనాడు మన సైనికులు 'నక్సల్‌ ముక్త్‌ భారత్‌ అభియాన్‌' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, కాంకెర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుంది'' అని 'ఎక్స్‌' (ట్విటర్) వేదికగా అమిత్‌ షా పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)