2022లో మహారాష్ట్రలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్‌ను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు సంబంధించి తాజాగా మరోసారి విచారణ జరిగింది. రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది ప్రన్షు అగర్వాల్ హాజరై.. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారని, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, పదే పదే విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు రూ.200 జరిమానా విధించిన అప్పర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం తదుపరి విచారణకు రాహుల్ తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. లేని పక్షంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేస్తామని హెచ్చరించింది.
రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధించిన ఉత్తర ప్రదేశ్ కోర్టు !
March 05, 2025
0
Tags