ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుండి సదరం స్లాట్‌లు తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర సెకండరీ హెల్త్ శాఖ డైరక్టర్ డాక్టర్ ఎ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావలసిన సదరం స్లాట్ లు నిలిపివేయబడ్డాయన్నారు. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు, వెరిఫికేషన్ తో పాటు స్లాట్ లను తిరిగి ప్రారంభించి, అర్హులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. ఈ స్లాట్ లు ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆసుపత్రులు/జీజీహెచ్‌లలో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయన్నారు. ఏప్రిల్ 1 నుండి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర సెకండరీ హెల్త్ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుండి సదరం స్లాట్‌లు తిరిగి ప్రారంభం !
March 26, 2025
0
Tags