తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్ ను ఉద్దేశించి అన్నారు. దీంతో స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి ఏం తప్పు మాట్లాడలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార, విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం : సభ 15 నిమిషాల పాటు వాయిదా
March 13, 2025
0
Tags