తెలంగాణలో మార్చి 15 నుండి అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నం వరకే బోధన జరగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్ కచ్చితంగా అసుసరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విద్యా శాఖ సూచించింది. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారం లోపం లేకుండా ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం అలాగే కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఏప్రిల్ 23 వరకు తరగతులు జరగనున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుండి వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ కాగా జూన్ 12న కొత్త విద్యా సంవత్సరంలో స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు !
March 12, 2025
0
Tags