అరుదైన ఘనత సాధించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ !

Telugu Lo Computer
0


ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 165 పరుగులు స్కోర్‌ చేసి అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్‌ నుంచి 165 పరుగుల స్కోర్‌ నమోదైంది. డకెట్‌కు ముందు వన్డేల్లో ఎవరూ ఈ సంఖ్యను (165) నమోదు చేయలేదు. తాజాగా డకెట్‌ 165 పరుగుల స్కోర్‌ చేయడంతో వన్డేల్లో 0 నుంచి 183 పరుగుల వరకు స్కోర్లు కనీసం ఒక్కసారైనా నమోదైనట్లైంది. ఈ మ్యాచ్‌లో 165 పరుగులు స్కోర్‌ చేయడంతో డకెట్‌ మరిన్ని రికార్డులు సాధించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఆటగాడు నాథన్‌ ఆస్టిల్‌ (145), జింబాబ్వే ప్లేయర్‌ ఆండీ ఫ్లవర్‌ (145 నాటౌట్‌) పేరిట ఉండింది. అలాగే ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగానూ డకెట్‌ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (141) పేరిట ఉండింది.

Post a Comment

0Comments

Post a Comment (0)