నిధులు తీసుకురావడంలో కూటమి సర్కార్ విఫలమైంది : బొత్స సత్యనారాయణ

Telugu Lo Computer
0


లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్ కు కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తుచేస్తూ, రాష్ట్రంలో కూటమి సర్కారే ఉన్నా, అందులో టీడీపీకి పదహారు మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీనే అని బొత్స గుర్తుచేశారు. అయితే, టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఈ బడ్జెట్ తో తేలిపోయిందన్నారు. టీడీపీ ప్రాధాన్యాలు వేరే అని చెప్పారు. బీహార్ తో పోల్చుకుంటే ఏపీకి ఈ బడ్జెట్ లో దక్కిన వాటా శూన్యమని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)