ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) కాగా మరొకరిని పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26)గా గుర్తించారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్ (25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. భార్గవ్ శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్‌తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఐర్లాండ్ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
February 01, 2025
0
Tags