నర్సాపురంలో పెళ్లివేడుకలో ఓ జంటపై యువకుల దాడి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఓ వేడుకలో ఒక జంటపై యువకులు దాడి చేశారు. దీంతో శుక్రవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుతూ, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ మేరకు వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల ఎదుటు కూడా దాడులు చేసుకున్నారు. చివరకు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనతో నర్సాపురంలో టెన్షన్ వాతావరం నెలకొంది. మళ్లీ దాడులు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)