మహిళ సురక్షితంగా ప్రయాణించేలా 'వాట్పాప్' గ్రూప్ ఏర్పాటు చేయాలని తమిళనాడు రాష్ట్ర రైల్వే పోలీసులు నిర్ణయించారు. రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు, సెల్‌ఫోన్, చైన్ స్నాచింగ్ ఘటనలు అధికమవుతున్నాయి. రాత్రి సమయాల్లో స్టేషన్‌లో ఒంటరిగా ఉంటున్న మహిళలు, రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఈ చర్యలు అడ్డుకొనేలా రైల్వేస్టేషన్లు, రైళ్లలో పోలీసు భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో, సబర్బన్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తరచూ ప్రయాణించే మహిళలను గుర్తించి, వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేయాలని రైల్వే పోలీసులు నిర్ణయించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో సంచరించే అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, దోపిడీలు, వేధింపుల ఘటనపై సభ్యులు వాట్సా్‌పలో పోస్ట్ చేసిన వెంటనే సత్వరం చర్యలు చేపట్టేందుకు ఈ గ్రూప్‌లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
రైళ్లలో మహిళల భద్రతకు 'వాట్సాప్ గ్రూప్'
February 26, 2025
0
Tags