కులగణనపై కుల సంఘాల నేతలకు వివరిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్‌

Telugu Lo Computer
0


కులగణనపై కులసంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. భారాస నేతలు సర్వేలో పాల్గొనరని, అవహేళన మాత్రం చేస్తారని ఎద్దేవా చేశారు. సర్వేలో పాల్గొన్న వాళ్లకే కులగణనపై మాట్లాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ''బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. భారాస నేతలు వెనుకబడిన వర్గాలకు క్షమాపణలు చెప్పాలి. కులగణనలో ఏ తప్పు లేదు.. ఏదైనా తప్పు కనిపిస్తే నా దృష్టికి తీసుకురావాలి. సబ్‌ప్లాన్‌, పథకాల రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్‌ ఉంది. ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న దీన్ని మా ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసింది. ఇందులో భాగంగా ప్రజలు ఇష్టపూర్వకంగా సమాచారం ఇచ్చారు. కులగణన చేయబోమని కేంద్రంలో భాజపా అఫిడవిట్‌ ఇచ్చింది. ఆ పార్టీ ఫ్యూడలిస్టిక్‌ పార్టీ'' అని పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)