కోమాలో రోడ్డు ప్రమాదానికి గురైన నీలమ్ శిండే !

Telugu Lo Computer
0


మెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని నీలమ్ శిండే కుటుంబానికి సహాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధితురాలి తండ్రి ఆవేదన తమ దృష్టికి రావడంతో అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు స్లాట్ కేటాయించింది. వీసా కోసం బాధితురాలి తండ్రి చేస్తోన్న ప్రయత్నాలు తమ దృష్టికి రావడంతో భారత విదేశాంగ శాఖ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం సానుకూలంగా స్పందించింది. వీసా లేక అత్యవసర ప్రయాణానికి అనుమతి ఇవ్వాలంటూ భారత విదేశాంగశాఖకు చెందిన అమెరికా విభాగం అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీజీ చేస్తోన్న నీలమ్ శిండే ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారు ఢీకొనడంతో నీలమ్ తల, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంటున్న ఆమె కుటుంబానికి ఫిబ్రవరి 16న ఈ విషయం తెలిసింది. నీలమ్ తండ్రి వెంటనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆ కుటుంబం ఆవేదన అందరి దృష్టికి చేరింది. ''నీలమ్ శిండే అనే విద్యార్థి యూఎస్‌ఏలో ప్రమాదానికి గురై అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఆమె తండ్రి ప్రయత్నిస్తున్నారు. ఆయన అత్యవసర వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆయనకు సహాయం చేయాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, భారత దౌత్య కార్యాలయాన్ని కోరుతున్నా'' అని ఎంపీ సుప్రియా సూలే ఎక్స్ వేదికగా కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)