ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం !

Telugu Lo Computer
0


ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తోపాటు.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు డిప్యూటీ సీఎంల హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ముచ్చటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)