ఒక్కరీల్ తో యూట్యూబర్ నాని చరిత్ర మొత్తం బయటపడింది. అతని బెట్టింగ్ యాప్ ల విషయం వెలుగులోకి వచ్చింది. ఇతనిపై పదుల సంఖ్యలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఐపీఎస్ సజ్జనార్ ట్వీట్స్ తో మొదలైన గందరగోళం చివరకు నాని బాగోతాన్ని బయటపెట్టింది. ఈ ట్వీట్ తో వైజాగ్ సీపీ లోకల్ బాయ్ నాని విషయంలో సీరియస్ అయ్యారు. దాంతో అతని మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు. చివరకు పలు సెక్షన్ల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. దాని తర్వాత అతనిని అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు. విశాఖ పట్నంకి చెందిన నాని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లలో వీడియోలు పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. దీంతో లోకల్ బాయ్ నానిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియో చేస్తూ యూట్యూబర్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని తన వీడియోలతో ఎంతో పాపులర్ అయ్యాడు. సముద్రంలో చేపలు పడుతూ చేసిన వీడియోలకు వేలల్లో లైక్స్, వ్యూస్ సంపాదించుకుంటున్నాడు. ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో తనకున్న ఫాలోయింగ్ ను నాని సొమ్ముచేసుకునేందుకు ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే చాలా మంది ఈ విషయంలో అతడిపై మండిపడ్డారు. ఇప్పటికే ఆన్ లైన్ బెట్టింగ్ లతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మళ్లీ వాటినే ప్రమోట్ చేయడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. దీనిపై ఐపీఎస్ సజ్జనార్ సైతం ఫైర్ అయ్యారు.
లోకల్ బాయ్ నాని అరెస్టు !
February 23, 2025
0
Tags