అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్య !

Telugu Lo Computer
0


సికింద్రాబాద్, అల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని  రైల్వే బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తుల మధ్య ఘర్షణలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాళ్లతో దాడికి పాల్పపడటంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి చేతిపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉందని, మెడలో కూడా ఆంజనేయస్వామి లాకెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)