కాశ్మీర్ లోయ ప్రాంతంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ మూడేళ్లు పొడిగింపు !

Telugu Lo Computer
0


కాశ్మీర్ లోయ ప్రాంతంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో కూడిన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌ను గత ఏడాది 2024 ఆగస్టు 1న మరో మూడేళ్లకు పొడిగించింది. ఈ ప్యాకేజ్ అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. ఈ లోయలో భాగంగా అనంత్ నాగ్, బారాముల్లా, బుడ్గాం, కుప్వారా పుల్వామా, శ్రీనగర్, కుల్గామ్, సోపియాన్, గందేర్బల్, బందిపోరాలో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ ప్యాకేజ్ ప్రకారం ఉద్యోగులు తమ కుటుంబసభ్యుల్ని ప్రభుత్వ ఖర్చులపై ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీనికి సంబంధించి 80 శాతం టీఏ కూడా అందుతుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లకపోతే రోజుకు 141 రూపాయల చొప్పున ప్రత్యేక అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.అదే విధంగా లోయలో ఉండే పెన్షనర్లకు సైతం ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ బ్యాంకులు లేదా ఆఫీసుల నుంచి నెలలవారీ పెన్షన్ పొందలేని వారికి వ్యాలీకు బయట అందించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)