అర్చకుడు రంగరాజన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌లో పరామర్శ !

Telugu Lo Computer
0


చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై జరిగిన దాడిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాడిని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)