పోలీసులకు చిక్కిన పూణె అత్యాచార నిందితుడు

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని పూణె అత్యాచార నిందితుడు దత్తాత్రయ రాందాస్(36) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.నిందితుడి కోసం దాదాపు 13 పోలీస్ బృందాలు వేటాడాయి. డ్రోన్లు, డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే పూణె సమీప గ్రామాల్లో ఎత్తున చెరుకు తోటలో ఉన్నట్లుగా డ్రోన్ సాయంతో గుర్తించారు. ఆ దిశగా పోలీసులు వేటాడారు. అయితే అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన ఆకలి వేయడంతో ఓ ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటికే నిందితుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. మొత్తానికి ఇంటి వారు పోలీసులకు రహస్యంగా సమాచారం ఇవ్వడంతో చాకచాక్యంగా పోలీసులు వచ్చి నిందితుడు దత్తాత్రయ రాందాస్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు రాందాస్‌పై అనేక నేరాలు, దోపిడీ కేసులు ఉన్నాయి. స్వర్గేట్ బస్టాండ్ దగ్గర ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా స్థానిక పోలీసులతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను కూడా పోలీస్ అంటూ నటించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇక వృద్ధులను ట్యాక్సీ ఎక్కించుకుని వారి దగ్గర బంగారం, డబ్బులు దోచుకునేవాడని సమాచారం. నిందితుడి దుర్మార్గాలను పోలీసులు వెలికి తీస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)