ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసారు. సెల్ఫీ వీడియోలో ఆమె మాట్లాడుతూ లైఫ్‌లో ఒకర్ని నమ్మి మోసపోయా. అప్పులు చేసి నేను అతనికి కోటి 20 లక్షలిచ్చాను. నా పిల్లల్ని చంపుతానని బెదిరించి నా దగ్గర బాండ్లు రాయించుకున్నాడు. నన్ను బెదిరించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర వున్నాయి. ఇంక నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకు సమాధానం చెప్పకలేకపోతున్నాను. అతనెవరంటే తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్. కేవలం కిరణ్ రాయల్ కారణంగానే నేను చనిపోతున్నా. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలికి ఇస్తారని ఆశిస్తున్నా అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేసారు.
కిరణ్ రాయల్ కారణంగానే నేను చనిపోతున్నా !
February 08, 2025
0
Tags