ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయం లో భారీ కెరీర్ ఫెయిర్ జరగనుంది. దీనిని మార్చి 5, 6వ తేదీల్లో నిర్వహించనున్నారు. 2004, 2025 పాస్ అవుట్ అయిన టెక్, ఆర్ట్స్, సైన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్ , డిప్లమా ఉత్తీర్ణులైన విద్యార్థులు పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు మార్చి 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ కెరీర్ ఫెయిర్ కు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నిరుద్యోగ యువతకు ఇదొక సువర్ణావకాశం. ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా, యువత తమ కలల కొలువును సొంతం చేసుకోవచ్చు. 49 అగ్రశ్రేణి కంపెనీలు ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి, అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను" అని అన్నారు. ఈ భారీ కెరీర్ ఫెయిర్‌లో 49 అగ్రశ్రేణి ఐటీ , ఐటీ యేతర కంపెనీలు పాల్గొంటాయి. 10,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం. ఉచిత నైపుణ్య శిక్షణ, కెరీర్ గైడెన్స్ వర్క్‌షాప్‌లు ఉంటాయి.
విశాఖపట్నంలో భారీ కెరీర్ ఫెయిర్ !
February 27, 2025
0
Tags