స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు. సిబ్బంది సైతం అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియజేసింది. ఈ ప్రమాదంలో హీరో తప్పు ఏమీ లేదని.. ఇతర కార్ల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ప్రమాదం జరిగిన కొంత సమయానికి ఆయన బయటకు వచ్చి.. అభిమానులతో ఫొటోలు దిగారు. రేస్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గడిచిన రెండు నెలల వ్యవధిలో అజిత్‌కు జరిగిన రెండో ప్రమాదం ఇది. జనవరి నెలలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా ఆయన కారు సమీపంలోని గోడను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం డ్యామేజ్ కాగా నాడు కూడా అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన టీమ్ విజయాన్ని అందుకుంది.స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు. సిబ్బంది సైతం అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియజేసింది. ఈ ప్రమాదంలో హీరో తప్పు ఏమీ లేదని.. ఇతర కార్ల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ప్రమాదం జరిగిన కొంత సమయానికి ఆయన బయటకు వచ్చి.. అభిమానులతో ఫొటోలు దిగారు. రేస్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గడిచిన రెండు నెలల వ్యవధిలో అజిత్‌కు జరిగిన రెండో ప్రమాదం ఇది. జనవరి నెలలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా ఆయన కారు సమీపంలోని గోడను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం డ్యామేజ్ కాగా నాడు కూడా అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన టీమ్ విజయాన్ని అందుకుంది.
స్పెయిన్‌లో అజిత్‌కు తప్పిన ప్రమాదం !
February 23, 2025
0
Tags