ఆంధ్రప్రదేశ్ లో ధార్ గ్యాంగ్ అరెస్టు !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ కు చెందిన ఈ దార్ గ్యాంగ్ చోరీలు చేయడంలో ఆరితేరింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ ముఠా సభ్యుల కదలికలు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురు దార్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ పి.జగదీశ్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. దార్ గ్యాంగులోని ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారయ్యారని వెల్లడించారు. నిందితుల నుంచి రూ.90 లక్షల విలువైన ఆభరణాలు, రూ.19.35 లక్షల నగదు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దార్ ముఠా సభ్యులు గత నెలలో అనంతపురంలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని ఎస్పీ వివరించారు. ఈ ముఠాలోని ఒక సభ్యుడిపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకంగా 32 కేసులు ఉన్నాయని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)