మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అల్లర్లను అరికట్టడంలో బీరెన్ సింగ్ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మణిపూర్‌లో తాజా రాజకీయ పరిస్థితులు, గత కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీరెన్ సింగ్ భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను గవర్నర్ కి అందజేశారు.
మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా !
February 09, 2025
0
Tags