బీహార్ రాజధాని పాట్నాలోని కాంకర్ బాగ్ ఏరియాలో ఓ ఇంటి ఆవరణలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక భూ వివాదం విషయంలో చోటుచేసుకున్న గొడవ కాల్పులకు దారి తీసింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దుండగులు తప్పించుకునేందుకు సమీపంలోని బిల్డింగులోకి వెళ్లారు. దాంతో పోలీసులు ఆ బిల్డింగును చుట్టుముట్టారు. దుండగులను లొంగిపోవాలని ఆదేశించారు. అనంతరం నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పారిపోయారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పాట్నాలో కాల్పుల కలకలం !
February 18, 2025
0
Tags