ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నుంచి విజేందర్ గుప్తా నామినేట్ !

Telugu Lo Computer
0


ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారని పార్టీ నాయకులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పార్టీ తన నామినేషన్‌ను ధృవీకరించిందన్నారు. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాగ్ నివేదికలను నేను సభ ముందు ఉంచుతానని అన్నారు. రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడవసారి ఎన్నికైన గుప్తా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి, ఆప్ సర్కార్ తన పని తీరుపై 14 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)