ప్రధాని నరేంద్ర మోడీని అక్కినేని నాగార్జున కలిశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మీద రాసిన ఓ పుస్తకానికి సంబంధించి ప్రధానితో అక్కినేని నాగార్జున భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల హైద్రాబాద్‌లో నాగార్జునకి సంబంధించిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం నేపథ్యంలో, రాజకీయంగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో వున్నారు అనేది ఓ ప్రచారం జరుగుతోంది. అయితే, సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల్ని కలవడంలో వింతేమీ లేదు. పైగా, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవడాన్ని రాజకీయ కోణంలో చూడలేం. సన్నిహిత సంబంధాల్ని బలోపేతం చేసుకోవడం.. అనే కోణంలోనే ఈ భేటీని చూడాల్సి వుంటుంది. సినీ పరిశ్రమతో, సినీ పరిశ్రమలోని వ్యక్తులతో సన్నిహిత సంబంధాల్ని బీజేపీ కూడా కోరుకుంటోంది. ఈ క్రమంలోనే సినీ ప్రముఖుల్ని బీజేపీ పెద్దలు తరచూ కలుస్తుండడమూ చూస్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అక్కినేని నాగార్జున !
February 09, 2025
0
Tags